- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రేకింగ్ : హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో ‘జూద క్రీడలు’.. ఈనెల 15 వరకు 30 మందికి రిమాండ్
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలుగుతున్న హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లే. అయితే, ఈ కుర్రహీరో ఫామ్ హౌస్‌లో పేకాట స్థావరం నిర్వహించిన వ్యక్తులపై ఆదివారం సాయంత్రం ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. నార్సింగి పోలీసులు జరిగిపిన దాడుల్లో మొదటగా 20 మంది నిందితులు అరెస్టు కాగా.. 20కి పైగా కార్లు, రూ.6 లక్షల నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో భాగంగా మరో పది మందిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మొత్తంగా 30 మంది నిందితులను ఉప్పరపల్లి కోర్టులో నార్సింగి పోలీసులు ప్రవేశ పెట్టారు. నిందితులు బెయిల్ కోసం అప్లై చేసుకోగా కోర్టు దానిని తోసిపుచ్చింది. పోలీసుల విన్నపం మేరకు ఈ నెల 15 వరకు వీరందరికీ రిమాండ్ విధించింది. ఇకపోతే నాగశౌర్య తండ్రికి కూడా నోటీసులు పంపించామని, ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడిన విషయంపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చి క్లారిటీ ఇవ్వాలన్నారు.
వచ్చేముందు ఆ ఫామ్‌హౌస్ ఇంటి రెంటల్ అగ్రిమెంట్ కూడా తీసుకురావాలని నాగశౌర్య తండ్రిని పోలీసులు ఆదేశించారు. అయితే, జూదం కోసం ఏర్పాటు చేసిన పేకాట స్థావరాల గురించి హీరో నాగశౌర్యకు తెలుసా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలాఉండగా, అరెస్టైన వారిలో మాజీ ఎమ్మెల్యే, నగరానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు ఉన్నారని పోలీసులు తెలిపారు.