ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం.. కారణం అదేనా ?

by Sumithra |   ( Updated:2021-09-23 00:20:53.0  )
ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం.. కారణం అదేనా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని దొరవారిసత్రం మండలం మోదుగులపాలెంలో ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో దంపతులు మురళి, మస్తానమ్మ మృతి చెందగా, కూతురు కావ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో పోలీసులు కావ్యను ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకొని ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed