సిరిసిల్లలో ముగ్గురికి కరోనా పాజిటివ్

by sudharani |
coronavirus
X

దిశ, కరీంనగర్:
రాష్ట్రంలో గ్రీన్‌జోన్‌ ఉన్న జిల్లాల్లో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.లాక్‌డౌన్ సడలింపులు, పక్క రాష్ట్రాల నుంచి వలస కూలీలు తిరిగి రావడంతోనే కేసులు పెరుగుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే సిరిసిల్ల జిల్లాలో ముగ్గురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. వేములవాడ మండలం నూకలమర్రికి చెందిన ఇద్దరు, గంభీరావు పేటలో ప్రైమరీ కాంటాక్ట్ అయిన మరో వ్యక్తికి కోవిడ్-19 సోకినట్టు తెలుస్తోంది.దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు వారిని గాంధీ తరలిస్తున్నారు. అలాగే వీరి ప్రైమరీ కాంటాక్ట్‌లను ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed