- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ అమ్మ లేవలేదు.. చిన్నారి ఆకలి తీరలేదు
దిశ, వెబ్ డెస్క్ : ‘‘ఇన్ని రోజులు ఆకలేస్తే అమ్మే తీర్చింది. దాహమేస్తే అమ్మే తీర్చింది. నొప్పి వస్తే అమ్మే లాలించింది. నిద్ర వస్తే అమ్మే జోకొట్టింది. కానీ ఇవాళ ఇంకా అమ్మ లేవదేం.. ఎండ కొడుతోంది.. ఆకలి అవుతోంది. అయినా అమ్మ లేవదేం.. అమ్మా.. లే అమ్మ. భయం వేస్తోంది. సీసాలో నీళ్లు అయిపోయాయి. దూప అవుతోంది.. ఆకలి అవుతోంది లే.. ఎవరో వచ్చి నిన్ను, నన్ను ఫొటోలు తీస్తున్నారమ్మ. అమ్మా.. పోలీసులు కూడా వస్తున్నారు. లే అమ్మ. మనం పోదాం లే…’’ అంటూ ఓ చిన్నారి రోడ్డు పక్కన పడుకున్న తల్లిని నిద్ర లేపుతోంది. తన బలాన్ని అంతా ఉపయోగించి గుంజుతోంది. అయినా ఆమెలో చలనం లేదు. అక్కడికి వచ్చిన వారంతా అయ్యో పాపం అంటున్నారే తప్పా.. ఆ చిన్నారికి సహాయం చేయడం లేదు. గంటల తరబడి ఆ చిన్నారి చేసిన ప్రయత్నం వృధానే అయింది. ఆ అమ్మ లేవలేదు. చిన్నారి ఆకలి తీరలేదు. ఆ ముక్కుపచ్చలారని బాలికకు ఏం తెలుసు.. ఆ అమ్మ శాశ్వత నిద్రలోకి జారుకుందని.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సూర్యాపేట పట్టణంలోని 30వ వార్డులో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన గుర్తు తెలియని అనాథ మహిళ (30) మృతి చెందింది. ఆమె పక్కన రెండేళ్ల లోపు వయసున్న చిన్నారి ఉన్నది. మహిళ బుర్కా ధరించి ఉన్నది. ఆమె వివరాలు ఏమీ లభించలేదు. ఆమె అనారోగ్యంతో మృతిచెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం పక్కన చిన్నారి ఏడుస్తూ కూర్చుంది. అభం శుభం ఎరుగని ఆ పసి హృదయం.. తల్లిని హత్తుకుని పడుకుంది. ఆ దృశ్యాలను చూసి అక్కడికి వచ్చిన వారు కంటతడి పెట్టారు. పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని సఖి కేంద్రం అధికారులకు అప్పగించారు.