28 మంది విద్యార్థులకు కరోనా.. ఎక్కడంటే!

by vinod kumar |   ( Updated:2021-03-18 10:07:47.0  )
28 మంది విద్యార్థులకు కరోనా.. ఎక్కడంటే!
X

దిశ, రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని వేర్వేరు ప్రభుత్వ పాఠశాల్లో 28 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రనగర్ ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులు, ఉద్యోగులు కలిపి 24 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇద్దరికి, శంషాబాద్ మండలం చిన్న గోల్కొండ ప్రభుత్వ పాఠశాలలో మరో ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. గిరిజన బాలికల వసతి గృహంలో 24 మంది విద్యార్థులను డాక్టర్ల పర్యవేక్షణలో క్వారంటైన్‌లో ఉంచారు. మరో నలుగురు విద్యార్థులను ఇంటికి పంపించి హోం క్వారంటైన్ లో ఉంచారు. మిగతా విద్యార్థులకు కూడా కరోనా పరీక్షలు చేయిస్తామని ప్రధానోపాధ్యాయులు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed