- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సిద్దిపేటలో దారుణం.. ఇంట్లోకి ఆడుకునేందుకు చిన్నారి వస్తే కోరికలు తీర్చుకుని ఎస్కేప్..!
దిశ, జగదేవపూర్ : అభం శుభం తెలియని చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పోసన్నపల్లి రమేష్ (27) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఇంటికి సమీపంలో ఉంటున్న చిన్నారి రోజు వారిలాగే ఈనెల 18వ తేదీన ఆడుకోవడానికి వెళ్ళింది. రమేష్ ఇంట్లో కుటుంబీకులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఎవరూ లేనిది చూసి నాలుగేళ్ల చిన్నారిపై ఇంట్లోనే లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది. చిన్నారి కుటుంబీకులు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలపడంతో కుటుంబీకులు గత వారం రోజులుగా గోప్యంగా ఉంచారు.
కామాంధుడు రమేష్ గత మూడు రోజులుగా గ్రామంలో కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. తిరిగి మంగళవారం నిందితుడు రమేష్ ఇంటికి రావడంతో చిన్నారి తల్లి, నానమ్మ ఇద్దరు కలసి రమేష్‌ను కొడుతుండగా పక్కనున్న వారు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు జరిగిన విషయం తెలిపారు. బుధవారం కుటుంబీకులు గ్రామస్థులతో కలిసి పోలీసులు సమాచారం అందించారు. ఎస్ఐ పరమేశ్వర్ గ్రామానికి చేరుకోని ఘటనకు సంబంధించి పూర్తి వివరాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడు రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్టు ఎస్ఐ తెలిపారు.