- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడిపల్లిలో రూ.250 కోట్లతో మెగా డెయిరీ
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో మెగా డెయిరీ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో రూ.250 కోట్లతో మెగా డెయిరీ నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు శ్రావణమాసంలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడారు. పశువులకు కృత్రిమ గర్భధారణపై త్వరలో రైతులకు అవగాహన కల్పించేందుకు మామిడిపల్లిలో 55ఎకరాల్లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేయాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని, గొర్రెల పెంపకందారులు, పాడి రైతులు, మత్స్యకారుల అభివృద్ధి కోసం వందల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని, గొల్ల, కురుమల అభివృద్ధి కోసం చేపట్టిన గొర్రెల పంపిణీలో 50శాతం మందికి పంపిణీ చేసినట్టు చెప్పారు. మిగిలిన లబ్ధిదారులకు త్వరలో పంపిణీ చేస్తామని, బ్రాండెడ్ మటన్ విక్రయాల కోసం ఔట్‌లెట్ల ఏర్పాటుకు అధ్యయనానికి కమిటీని నియమించామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం 80లక్షల గొర్రెలను పంపిణీ చేయగా పిల్లలతో కలుపుకుని వాటి సంఖ్య 2కోట్లకు చేరిందన్నారు. విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేసేలా ప్రతిచోటా ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ముందస్తు చర్యలతో లాక్‌డౌన్ పరిస్థితుల్లో కూడా పాలు, పెరుగు కొరత రాకుండా చూడగలిగామని మంత్రి చెప్పారు. ఖమ్మం, వనపర్తిల్లో ఒక్కోచోట 5ఎకరాల విస్తీర్ణంలో పీప్స్ మార్కెట్‌ల నిర్మాణానికి రూ. 25లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తున్నామన్నారు. చేప పిల్లల కొనుగోలు, పంపిణీలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని మంత్రి తలసాని వెల్లడించారు.