భారత్‌కు ఉచితంగా 25 కోట్ల టీకాలు

by Shamantha N |
భారత్‌కు ఉచితంగా 25 కోట్ల టీకాలు
X

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌తో సతమతమవుతూ టీకా కొరతను ఎదుర్కొంటున్న భారత్‌కు గ్లోబల్ అలయెన్స్ గావి(గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్) శుభవార్తను తెలిపింది. ఇండియాకు 19 నుంచి 25 కోట్ల టీకాలను పూర్తి సబ్సిడీతో అందజేయడానికి నిర్ణయించినట్టు వెల్లడించింది. టెక్నికల్ అసిస్టెన్స్, కోల్డ్ చైన్ ఎక్విప్‌మెంట్ల కోసం 30 మిలియన్ యూఎస్ డాలర్లను సహాయం చేయనున్నట్టు వివరించింది. డిసెంబర్‌లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గావి ప్రతినిధి తెలిపారు. స్వల్ప, మధ్యాదాయ దేశాలకు టీకాలను అందించడానికి పబ్లిక్-ప్రైవేట్ గ్లోబల్ హెల్త్ పార్ట్‌నర్‌షిప్‌గా సేవలందిస్తున్న గావి, ప్రస్తుత సంక్షోభం నుంచి భారత్ బయటపడటానికి పూర్తి సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నదని ప్రతినిధి వివరించారు.

Advertisement

Next Story

Most Viewed