వనపర్తి జిల్లాలో 240 వాహనాలు సీజ్

by Sumithra |
వనపర్తి జిల్లాలో 240 వాహనాలు సీజ్
X

దిశ, మహబూబ్ నగర్: ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా రోడ్లపై ఇష్టానుసారంగా తిరిగిన 240 వాహనాలను సీజ్ చేసి 460 వాహనాలకు జరిమానాలు విధించామని వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు తెలిపారు. కరోనా వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్‌ను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. లాక్ డౌన్ ఉత్తర్వులను అనుసరించి ప్రజా రవాణాను పూర్తిగా నిషేదించడం జరిగిందన్నారు. ఈ నెల 31వ తేది వరకు సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలులో వుంటుందని వివరించారు. కరోనా వ్యాధికి సంబంధించి వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలలో.. ప్రజలను తప్పుదారి పట్టిస్తూ తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

tag: corona, lockdown, 240 Vehicles Siege, Wanaparthy

Advertisement

Next Story

Most Viewed