24 గంటల్లో 2 వేలకు పైగా కొత్త కేసులు

by vinod kumar |
24 గంటల్లో 2 వేలకు పైగా కొత్త కేసులు
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2 వేలకు పైగా కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. ఒక్క రోజులోనే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. శుక్రవారం దేశవ్యాప్తంగా 2,293 కేసులు నమోదు కావడంతో ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య 37,336కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బులెటెన్ విడుదల చేసింది. ఇక మరణాల విషయానికొస్తే శుక్రవారం 71 మంది వైరస్ కారణంగా మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,218కి పెరిగింది.
అలాగే, దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 9,950 మంది కోలుకోగా, ప్రస్తుతం 26,167 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను మే 17 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

Tags: corona, india, last 24 hours, 2296 positive cases, 71 deaths

Next Story

Most Viewed