Weather: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు బయటికి రావద్దు!

by D.Reddy |
Weather: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు బయటికి రావద్దు!
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎండలు (Summer) మండుతున్నాయి. తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు (Temperatures) సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ఏడు జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రెడ్ అలర్ట్ ఇచ్చిన ఏడు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది.

ఇక ఇవాళ, రేపు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశముందని పేర్కొంది. చాలా జిల్లాల్లో రాత్రిపూట వేడి వాతావరణం మరింత ఎక్కువగా ఉండనుందని తెలిపింది. ఉదయం 10 నుంచి 4 గంటల వరకు ప్రజలు బయటకు రాకుంటే మంచిదని సూచించింది. అత్యవసరం ఉంటేనే ప్రజలు మధ్యాహ్నం బయటకు రావాలంది. రైతులు, కూలీలకు వడదెబ్బ ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది. అలాగే శుక్ర, శనివారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే వీలుందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది.



Next Story

Most Viewed