బీహార్‌లో వరదల బీభత్సం.. 21 మంది మృతి

by Anukaran |
బీహార్‌లో వరదల బీభత్సం.. 21 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్‌‌లో కురుస్తున్న వర్షాల వల్ల అక్కడి నదుల నుంచి బీహార్‌కు వరద నీరు పోటెత్తెంది. దీంతో రాష్ట్రంలోని 16 జిల్లాలు జలమయమయ్యాయి. ఈ వరదల వలన ఇప్పటివరకు 21 మంది మృతి చెందగా, 69 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 33 బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతున్నాయి. బీహార్‌ ప్రభుత్వం గురువారం పలు జిల్లాల్లో 8 సహాయ శిబిరాలు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా 1,402 కమ్యూనిటీ కిచెన్లు సిద్ధం చేయించింది.

వరదల వలన బీహార్‌లో ఇప్పటివరకు 4.82 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో 12,239 మంది సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. రాష్ట్రంలోని ఖగారియా, సహర్సా, దర్భాంగా జిల్లాల్లో పడవ బోల్తా పడిన మూడు వేర్వేరు ఘటనల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోగా, సీఎం నితీశ్‌కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలపై సీఎం ఏరియల్‌ సర్వే చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed