- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా లీగ్ స్టేజిలో చివరి మ్యాచ్ ఈ రోజు భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరుగుతుంది. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నెదర్లాండ్స్ జట్టు బౌలింగ్ చేయనుంది. కాగా వరుస విజయాలతో ఊపు మీద ఉన్న భారత్ పసికూనలపై ఈ రోజు కూడా విజయం సాధించి లీగ్ స్టేజ్ లో అన్ని మ్యాచుల్లో విజయం సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పాలని చూస్తుంది.
కాగా ఈ మ్యాచ్‌లో పలు మార్పులు ఉంటాయని అందరూ ఉహించినప్పటకి ఎటువంటి మార్పు లేకుండా భారత్ బరిలోకి దిగుతుంది. అలాగే నెదర్లాండ్స్ జట్టు భారత్ పై విజయం సాధించి సంచలనం సృష్టించాలని చూస్తోంది. అలాగే ఈ విజయంతో ఛాంపియన్ ట్రోఫీకి అర్హత సాధించాలని కూడా చూస్తుంది. మరీ ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ గెలుస్తుందా లేదా తెలియాలంటే చూడాలి మరి.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్