Mohammed Rizwan: గాజాకు మద్దతుగా ట్వీట్.. పాక్ ప్లేయర్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఇజ్రాయెల్

by Vinod kumar |   ( Updated:2023-10-18 05:02:22.0  )
Mohammed Rizwan: గాజాకు మద్దతుగా ట్వీట్.. పాక్ ప్లేయర్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఇజ్రాయెల్
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా ఈనెల 10న లంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు లంకేయులు నిర్దేశించిన 345 పరుగుల లక్ష్యాన్ని మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. మ్యాచ్‌లో రిజ్వాన్‌.. 131 పరుగులు చేశాడు. మ్యాచ్‌ గెలిచిన తర్వాత రిజ్వాన్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా స్పందిస్తూ.. ‘ఈ విజయం గాజాలోని మా అక్కాచెల్లెళ్లకు, అన్నాతమ్ముళ్లకు అంకితం. గెలిచినందుకు సంతోషంగా ఉంది. పాకిస్తాన్‌ టీమ్‌తో పాటు ప్రత్యేకించి అబ్దుల్లా షఫీక్‌, హసన్‌ అలీలు మా విజయంలో కీలక పాత్ర పోషించారు’ అని ట్వీట్‌ చేశాడు.

కాగా భారత్‌ – పాకిస్తాన్‌ మధ్య అహ్మదాబాద్‌లో మ్యాచ్‌ ముగిశాక ఇజ్రాయెల్‌.. రిజ్వాన్‌తో పాటు పాకిస్తాన్‌కూ కౌంటర్‌ ఇచ్చింది. భారత్‌ –పాక్‌ మ్యాచ్‌ ముగిశాక ఇజ్రాయెల్‌ స్పందిస్తూ.. ‘మా భారతీయ మిత్రులు ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలుపుతుండటం మమ్మల్ని ఎంతగానో కదిలించింది. భారత్‌ – పాకిస్తాన్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. తద్వారా పాకిస్తాన్‌కు తమ విజయాన్ని హమాస్‌ ఉగ్రవాదులకు ఆపాదించడానికి అవకాశం లేకుండా పోయింది..’అని ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed