ICC World Cup 2023: ముష్ఫికర్‌-షకీబ్‌ అరుదైన ఘనత.. సెహ్వాగ్-సచిన్‌ రికార్డు బ్రేక్‌

by Vinod kumar |
ICC World Cup 2023: ముష్ఫికర్‌-షకీబ్‌ అరుదైన ఘనత.. సెహ్వాగ్-సచిన్‌ రికార్డు బ్రేక్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్ జోడీ వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అరుదైన ఘనత సాధించారు. వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో అరుదైన భాగస్వామ్య రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో ముష్ఫికర్ రహీం (66), షకీబ్ అల్ హసన్ (40) పరుగులు చేశారు. ఇద్దరూ కలిపి 19 ఇన్నింగ్స్‌లో 972 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ సాధించారు. తద్వారా సెహ్వాగ్‌- సచిన్‌ల రికార్డును బ్రేక్ చేశారు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్‌- సచిన్‌ టెండుల్కర్‌ కలిపి 20 ఇన్నింగ్స్‌లో 971 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ జాబితాలో 20 ఇన్నింగ్స్‌లో 1220 పరుగుల భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా మాజీ స్టార్లు ఆడం గిల్‌క్రిస్ట్‌- మాథ్యూ హెడెన్‌ ఫస్ట్‌ప్లేస్‌లో కొనసాగుతున్నారు. బంగ్లా, టీమిండియా జోడీలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కాగా కివీస్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు స్కోరు చేసింది.

Advertisement

Next Story