- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICC World Cup 2023: చాక్లెట్‌తో వరల్డ్‌కప్ తయారీ.. మొత్తం తినేయొచ్చు
దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా నేడు (అక్టోబర్ 29)న భారత్- ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్జరగుతోంది. ఈ క్రమంలో ఎక్కడ చూసినా ఇప్పుడు క్రికెట్మేనియా నడుస్తోంది. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్‌సేన ఈ ఆరో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో పూజలు, యాగాలు చేస్తున్నారు. మరోవైపు టీమిండియా అభిమానాన్ని ఫ్యాన్స్ఏదో ఒక రూపంలో చూపిస్తూనే ఉన్నారు. తాజాగా ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఓ చెఫ్బృందం ఓ వినూత్న ఐడియాతో ముందుకొచ్చారు.
చాక్లెట్‌ను ఉపయోగించి వరల్డ్ కప్నమూనాను తయారు చేశారు. ఈ నమూనా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏడుగురు చెఫ్‌లతో కూడిన ఓ బృందం.. దాదాపు మూడు రోజులు కష్టపడి ఈ కప్‌ను తయారు చేశారు. ఇందులో ఉన్న గోల్డ్పూత సహా అన్ని తినే పదార్థాలతోనే రూపొందించినట్లు చెఫ్బృందం తెలిపింది. 18 డిగ్రీల ఉష్ణోగ్రతలో చాక్లెట్‌ను ఎక్కడా కూడా కరగకుండా ఉండేలా జాగ్రత్తపడుతూ ఈ నమూనాను తయారు చేశారట.