WorldCupFinal: కన్నీరు పెట్టిన రోహిత్, విరాట్ (వీడియో)

by GSrikanth |
WorldCupFinal: కన్నీరు పెట్టిన రోహిత్, విరాట్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ మైదానం వేదికగా జరిగిన 2023 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆదివారం ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ను ఆరోసారి గెలుచుకుంది. కోట్లాది మంది భారతీయ అభిమానుల మధ్య స్వదేశంలో ప్రపంచ కప్‌ను సగర్వంగా ఎత్తుకోవాలన్న టీమిండియా ఆశలు అడియాశలవ్వడంతో అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్ సేన కీలక మైన ఫైనల్‌ మ్యాచ్‌లో బోల్తా పడటంతో జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో మ్యాచ్ ఓడిపోయాక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కన్నీరుతో మైదానం నుంచి బయటకు వెళ్లడం అభిమానులను కూడా భావోద్వేగానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గామ మారాయి. కాగా, రోహిత్, విరాట్‌లకు ఇదే చివరి వరల్డ్ కప్ అని ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed