- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్టార్ ఇండియాకు క్యూ కట్టారు
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో క్రీడలు వాయిదా పడ్డాయి. ఒలింపిక్స్ (Olympics), టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) వంటి మెగా ఈవెంట్లను కూడా నిర్వహించలేక వాయిదా వేశారు. మరోవైపు ఆర్థిక సంక్షోభం (financial crisis) కారణంగా స్పాన్సర్లు (Sponsors) కూడా ముందుకు రాలేక పలు బోర్డులు నష్టాల పాలవుతున్నాయి. అయితే బీసీసీఐ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ (BCCI Cash Rich League IPL)కు మాత్రం స్పాన్సర్లు క్యూ కడుతున్నారు.
ఇండో-చైనా ఘర్షణల కారణంగా చైనా కంపెనీలు స్పాన్సర్‌గా వెనక్కు తగ్గాయి. కానీ భారతీయ కంపెనీలు మాత్రం ఐపీఎల్ (IPL)పై అమితాసక్తి చూపించాయి. యాడ్స్ రెవెన్యూ తగ్గిపోతుందేమోనని బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియా (Broadcaster Star India) మొదట్లో భయపడింది. కానీ ప్రస్తుతం 200 మంది అడ్వర్టైజర్లు (Advertisers) స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. లీగ్ ప్రారంభానికి మరో 12 రోజుల గడువు ఉండటంతో మరో 20 నుంచి 30 మంది అడ్వర్టైజర్లు కూడా దొరుకుతారని స్టార్ చెబుతున్నది. ఈ ఏడాది అంచనా వేసిన రూ.3వేల కోట్లు స్టార్ ఇండియా సాధిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.