- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లారీ, బైక్ ఢీ : ఇద్దరు స్పాట్ డెడ్
దిశ, వెబ్ డెస్క్: కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మంగళవారం ఎమ్మిగనూరు నుండి కర్నూలు వైపు వెళుతున్న లారీ.. బైక్ ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
రాళ్లదొడ్డి గ్రామానికి కొద్ది దూరంలో మోరి సమీపంలో ముందుగా లారీ వెళుతుంది. లారీ వెనక బైక్ పై భార్యాభర్తలు వెళుతున్నారు. లారీని దాటి ముందుకు వెళ్లే ప్రయత్నంలో కుడి వైపు నుండి లారిని క్రాస్ చేయాల్సిన మృతులు ఎడమ వైపు నుండి క్రాస్ చేస్తుండగా బైక్ కి, లారీ తగిలింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ లారీ టైర్ల కింద పడ్డారు.
టైర్లు వారి తల, శరీర భాగాలపై నుండి వెళ్లడంతో శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు లారీని ఆపారు. ఎమ్మిగనూరు రూరల్ సిఐ మహేశ్వర రెడ్డి, ఎస్ఐ రామసుబ్బయ్య, పోలీసులు అక్కడికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.