నుజ్జునుజ్జయిన వాహనంలో మృతదేహాలు

by Anukaran |
నుజ్జునుజ్జయిన వాహనంలో మృతదేహాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన వాహనంలో రెండు మృత దేహాలు ఇంజిన్ లోనే ఇర్కుకున్నాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బట్టిసవర్గం వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. వారి మృతదేహాలు ఇంజిన్ లోనే ఇరుక్కుపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని ఆ మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story