వరంగల్ అర్బన్‌లో‌ ఇద్దరికి కరోనా

by vinod kumar |
వరంగల్ అర్బన్‌లో‌ ఇద్దరికి కరోనా
X

దిశ, వరంగల్ :
వరంగల్ అర్బన్ జిల్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. కాజీపేట దర్గాకు చెందిన ఓ వృద్ధుడు, హన్మకొండ ఎక్సైజ్ కాలనీకి‌ చెందిన ఓ యువకుడు కొద్దిరోజుల కిందట కరోనా లక్షణాలతో ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. గురువారం వారిద్దరికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఎంజీఎం కొవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ప్రకటించారు.లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చాక కరోనా కేసులు పెరుగుతుండటంతో అర్బన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed