ఫస్ట్ డోసుకు విరామం.. సెకండ్ డోసుకు గ్రీన్ సిగ్నల్

by vinod kumar |   ( Updated:2021-05-07 06:51:41.0  )
ఫస్ట్ డోసుకు విరామం.. సెకండ్ డోసుకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కేసుల కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. మే మొదటి వారంలో 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వారికి ఉచితంగా టీకా అందిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా అది ఆచరణకు నోచుకోలేదు. వ్యాక్సిన్ కోసం రాష్ట్రంలో ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రజలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అయితే, తొలి డోసు తీసుకుని సెకండ్ డోస్ కోసం ఎదురు చూస్తున్న వారికి ముందుగా కంప్లీట్ వ్యాక్సిన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మొదటి డోసు ప్రక్రియను ఈనెల 15వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రేపటి నుంచి(శనివారం) సెకండ్ డోసు మాత్రమే ఇవ్వాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం తొలి డోసు తీసుకుని రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న వారు రాష్ట్రంలో 11లక్షల మంది ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. అందువల్లే తొలిడోసు తీసుకోని వారి కంటే తీసుకున్న వారికి రెండు దశల్లో టీకా ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed