జపాన్‌‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. 19మంది గల్లంతు

by Sumithra |
జపాన్‌‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. 19మంది గల్లంతు
X

దిశ, వెబ్‌డెస్క్ : జపాన్ దేశాన్ని భారీ వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 19 మంది గల్లంతయ్యారు. కనిపించకుండా పోయిన వారికోసం అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా అట్మి అనే ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది.

అందులో చిక్కుకుని స్థానికులు కనిపించకుండా పోయారు. చుట్టుపక్కల ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి. అప్రమత్తమైన సహాయక బృందాలు మేటల్లా ఉన్న బురదను తొలగించి అందులో చిక్కుకున్న వారికి రక్షించే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

Next Story