తెలంగాణలో కరోనా విజృంభణ

by Anukaran |   ( Updated:2020-07-06 10:52:26.0  )
తెలంగాణలో కరోనా విజృంభణ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో 1,831 కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పరిధిలోనే 1,419 కేసులు రాగా, రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్ జిల్లాలో 116 కొత్త కేసులు వచ్చాయి. ఇవాళ 11మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 306కు చేరింది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 25,733గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 10,646 కాగా, ఇప్పటివరకు చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 14,781గా ఉంది.

Advertisement

Next Story