- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో ప్రాధాన్యతలోనూ పల్లాదే పైచేయి
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రసవత్తరంగా మారింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఇప్పటివరకు 40 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ఈ 40 మంది ఎలిమినేట్ అయ్యే సమయానికి రెండో ప్రాధాన్యత ఓట్లు 1312 వచ్చాయి. అయితే ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 174 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 149 ఓట్లు, కోదండరామ్‌కు 193 ఓట్లు వచ్చాయి.
ఇదిలావుంటే.. రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ పల్లా రాజేశ్వర్ రెడ్డి పైచేయి సాధిస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,10,840 కాగా, రెండో ప్రాధాన్యత ఓట్లు 174 కలిపితే.. మొత్తంగా 1,11,014 ఓట్ల ఆధిక్యంతో మొదటి స్థానంలో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓట్లు 83,390 కాగా, రెండో ప్రాధాన్యతలో వచ్చిన 149 ఓట్లను కలిపితే.. 83,539 ఓట్లు వచ్చాయి. ఇక కోదండరామ్‌కు మొదటి ప్రాధాన్యతలో 70072, రెండో ప్రాధాన్యతలో 193 ఓట్లు రాగా, మొత్తంగా ఇప్పటివరకు 70,265 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది.