తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

by Anukaran |
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,708 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,14,792 కు చేరింది. కొత్తగా వైరస్ బారినపడి 5 గురు మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 1,233 కు పెరిగింది. తాజాగా వైరస్ బారినుంచి సంపూర్ణ ఆరోగ్యంగా 2,009 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,89,351 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 24,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 277 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

Next Story