కాంగ్రెస్‌కు భారీ షాక్.. 170 ఎమ్మెల్యేలు జంప్

by Shamantha N |   ( Updated:2021-03-11 08:40:17.0  )
కాంగ్రెస్‌కు భారీ షాక్.. 170 ఎమ్మెల్యేలు జంప్
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. ఆ పార్టీకి చెందిన నేతలు బీజేపీ, ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రెటిక్ రిఫార్మ్స్’ (ఏడీఆర్)రిపోర్ట్‌ సర్వే విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2016-20 మధ్య కాలంలో కాంగ్రెస్‌కు చెందిన 170 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాక్ ఇచ్చి వేరే పార్టీల్లో చేరారు. అదే సమయంలో కేవలం 18 మంది మాత్రమే బీజేపీని వీడి, ఇతర పార్టీల్లో చేరారని ఈ సర్వే తెలిపింది. అయితే సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు వివిధ పార్టీల్లొకి జంప్ అయినట్టు నివేదిక వెల్లడించింది.

పార్టీలు మారిన వారిలో 405 మంది తిరిగి పోటీ చేయగా 182 మంది బీజేపీలో చేరారు. 38 మంది కాంగ్రెస్‌లో చేరారు. 25 మంది తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఐదుగురు బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు తమ పార్టీలను వీడారని ఈ సర్వే వెల్లడించింది. 2016-20 మధ్య కాలంలో పార్టీ మారిన వారిలో 16 మంది తిరిగి రాజ్యసభకు పోటీ చేశారు. అందులో 10 మంది బీజేపీలో చేరగా.. 12 మంది లోక్‌సభ ఎంపీల్లో ఐదుగురు కాంగ్రెస్‌లో చేరారు.

Advertisement

Next Story