ANSHU : త్రినాథరావు కామెంట్స్.. స్పందించిన నటి అన్షు

by M.Rajitha |   ( Updated:2025-01-13 14:18:27.0  )
ANSHU : త్రినాథరావు కామెంట్స్.. స్పందించిన నటి అన్షు
X

దిశ, వెబ్ డెస్క్ : డైరెక్టర్ త్రినాథరావు(Director TrinathaRao) చేసిన కామెంట్స్ పై నటి అన్షు(Actress Anshu) స్పందించారు. మొదట తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. త్రినాథరావు తనపై చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోందని తన దృష్టికి వచ్చిందన్నారు. ఆయన తనని కుటుంబ సభ్యురాలిగా భావించారని, తనతో ఎంతో స్నేహంగా ఉన్నారని చెప్పుకొచ్చింది ఈ భామ. ఆయనపై తనకి చాలా గౌరవం ఉందని.. మహిళల పట్ల ఆయనకి చులకన వభావం ఉందని తాను అనుకోవడం లేదని, దయచేసి ఇంతటితో ఈ డిబేట్ కి ఫుల్ స్టాప్ పెట్టండి అంటూ విజ్ఞప్తి చేసింది. కాగా 'మజాకా'(Majaka) మూవీ ఈవెంట్ లో ఆ సినిమా డైరెక్టర్ త్రినాథరావు అన్షు బాడీ మీద కామెంట్స్ చేయగా.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయ్యి వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపించింది. అనంతరం త్రినాథరావు క్షమాపణ కోరుతూ వీడియో షేర్ చేయగా.. తాజాగా అన్షు కూడా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని కోరుతూ వీడియో షేర్ చేయడం గమనార్హం.

Next Story

Most Viewed