- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Padi Koushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

X
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Koushik Reddy)ని పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్ లో కరీంనగర్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో ఆయనను కరీంనగర్ తరలించనున్నారు. కాగా ఆదివారం కరీంనగర్ కలెక్టర్ ఆఫీసులో జిల్లా అభివృద్దిపై జరుగుతున్న సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) మాట్లాడుతుండగా.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకొని, కార్యక్రమంలో గొడవ సృష్టించిన విషయం తెలిసిందే. కాగా తనను కౌశిక్ రెడ్డి అసభ్య పదజాలంతో తిడుతూ, బెదిరింపులకు పాల్పడ్డాడని ఎమ్మెల్యే సంజయ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నేడు కౌశిక్ రెడ్డిని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు.
Next Story