- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యుద్ఘాతంతో 17 బర్రెలు మృతి
by Shyam |
X
దిశ, వరంగల్: ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో 17 బర్రెలు మృతి చెందాయి.ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని కాసిందేవి పేటలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి ఉదయం బర్రెలను మేపడానికి తన వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లాడు. అదే సమయంలో ప్రమాదవశాత్తు 11 కేవీ వైరు నేలపై పడింది. కాపరి దానిని గమనించకపోవడంతో పశువులు వైరు దగ్గరికి వెళ్లి మృత్యువాత పడ్డాయి. ఈ ప్రమాదంతో సుమారు రూ.15 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. మరో 3 బర్రెలు గాయపడటంతో వెటర్నరీ వైద్యులు వాటికి చికిత్స అందిస్తున్నారు. పశువుల కాపరికి వాటిల్లిన నష్టానికి పరిహారం ఇప్పిస్తామని విద్యుత్ శాఖ అధికారులు హామీ ఇచ్చారు.
tags : power shock, 17 buffaloes died, accidentally, warangal
Advertisement
Next Story