'ఏపీలో 165 కంటైన్మెంట్ జోన్లు'

by srinivas |   ( Updated:2020-04-15 08:50:39.0  )
neelam
X

ఆంధ్రప్రదేశ్‌‌లో 165 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని తెలిపారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆమె పలు వివరాలు వెల్లడించారు. ఒక కరోనా పాజిటివ్ కేసు వచ్చిన వ్యక్తి ఇంటి చుట్టూ ఉన్న 100 ఇళ్లను కంటోన్మెంట్ జోన్‌గా పేర్కొంటామన్న ఆమె.. అలాంటి 165 జోన్లు ఏపీలో ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా లాక్ డౌన్ కు సంబంధించిన అన్ని నిబంధనలను ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా కేసులకు చికిత్సనందించే ఆసుపత్రుల సన్నద్ధతకు తగిన చర్యలు తీసుకుంటుంన్నామని ఆమె వెల్లడించారు. భారీ సంఖ్యలో కరోనా పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు కరోనా టెస్టింగ్‌కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ప్రకటించారు.

Tags: corona virus, covid-19, contonment zones, lockdown, neelam sahni, ap cs,

Next Story

Most Viewed