- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మల్‌లో అరుదైన జాతీయ జెండా
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రానికి మరో అద్భుత నిర్మాణం సరికొత్త అందాలను తేనుంది. నిర్మల్ పట్టణంలోని ధర్మసాగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద 150 అడుగుల భారీ జాతీయ జెండాను నిర్మిస్తున్నారు. ఈ పంద్రాగస్టుకే అరుదైన జెండా ఆవిష్కృతం కానుంది. శుక్రవారం జాతీయ జెండా నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్‌తో కలిసి జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రంలో భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణమంతా కనిపించేలా 150 అడుగుల ఎత్తయిన జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నామని, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాటికీ నిర్మాణ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ జాతీయ జెండా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న జెండాను పోలి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై జిల్లా ప్రజలు ఆసక్తిని చూపుతున్నారు.