- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆటో బస్సు ఢీ.. 13 మంది మృతి.. డ్రైవర్ తప్ప మృతులంతా మహిళలే..
X
దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆటో బస్సు ఢీ కొని 13 మంది మృతి చెందారు. గ్వాలియర్‌లో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన బస్సు ఆటోను ఢీ కొట్టడంతో ఈ దారుణం చోటు చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ మినహా మృతులంతా మహిళలే కావడం విషాదకరం.
గ్వాలియర్ లోని ఓల్డ్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. రెండు వైపులా మితిమీరిన వేగంతో వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్నవారంతా అక్కడికక్కడే మరణించారు. ఆ మహిళలంతా అంగన్‌వాడీ వర్కర్లని తెలుస్తున్నది. ఒక మీటింగ్ నిమిత్తం గ్వాలియర్ వెళ్తున్న వారంతా.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story