కరోనాతో మరో సింహం మృతి.. ఆ జూలో నాలుగింటికి డెల్టా వేరియంట్..!

by Sumithra |
lion-died 1
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి బారిన పడి మనుషులతో పాటు వన్యమృగాలు కూడా బలవుతున్నాయి. ఇటీవల తమిళనాడులోని జూలో కరోనా సోకి ఆడ సింహం మరణించిన విషయం మరువక ముందే తాజాగా అదే జూలో మరో సింహం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది.. జూ అధికారుల కథనం ప్రకారం.. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వలన తమిళనాడులోని వండలూర్ అరిగ్నార్ అన్నా జులాజికల్ పార్కులోని సింహాలు కరోనా బారిన విషయం తెలిసిందే.

మొత్తం 11 సింహాలకు గాను తొమ్మిదింటిలో కొవిడ్ లక్షణాలు కనిపించాయి. అందులో నీలా అనే తొమ్మిదేండ్ల ఆడ సింహం ఈనెల 3న మరణించగా, జూన్ 16న పద్మనాధన్ అనే 12 ఏళ్ల మగ సింహం చనిపోయింది. ప్రస్తుతం 9 సింహాలు కరోనా లక్షణాలతో చికిత్స పొందుతుండగా, అందులో నాలుగు సింహాలకు డెల్టా వేరియంట్ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. కాగా, లాక్‌డౌన్ కారణంగా చెన్నై జూ నెల రోజులు మూసి ఉండగా, సింహాలకు వైరస్ ఎలా వచ్చిందనే విషయం ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed