- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రానికి 12 కేంద్ర అవార్డులు
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక ‘ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్’ అవార్డులను బుధవారం ప్రకటించారు. వీటిలో తెలంగాణ 12 అవార్డులను కైవసం చేసుకుంది. అందులో ఒకటి ఉత్తమ జిల్లా పరషత్, రెండు ఉత్తమ మండల పరిషత్, తొమ్మిది ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు వచ్చాయి. ఉత్తమ జిల్లా పరిషత్ గా మెదక్, ఉత్తమ మండల పరిషత్ గా జగిత్యాల జిల్లా లోని కోరుట్ల, పెద్దపల్లి జిల్లా లోని ధర్మారం, ఉత్తమ గ్రామపంచాయతీలుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా హరిదాస్ నగర్ , సిద్దిపేట జిల్లా మిట్టపల్లి, సిద్దిపేట జిల్లా మల్యాల, ఆదిలాబాద్ జిల్లా రుయ్యడి, మహబూబ్ నగర్ జిల్లా చక్రాపూర్, పెద్దపల్లి జిల్లా సుందిళ్ల, సిరిసిల్ల జిల్లా మోహినికుంట, పెద్దపల్లి జిల్లా సుందిళ్ల గ్రామపంచాయతీలకు 12 అవార్డులు వచ్చాయి.
అందులో చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామపంచాయతీగా మోహినికుంట , గ్రామపంచాయతీ డెవలప్మెంట్ అవార్డును సుందిళ్ల కైవసం చేసుకున్నాయి. రాష్ట్రానికి అవార్డులు రావటం పై పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ముందు చూపు, చొరవ, మార్గనిర్దేశం వల్లనే ఈ అవార్డులు వచ్చాయన్నారు. రాష్ట్రంలోని గ్రామాల, మండలాల అభివృద్ధిని కేంద్రం గుర్తించి ప్రతి యేటా అవార్డులు ఇస్తోందన్నారు. సీఎం కేసీఆర్ కి, కేంద్రానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు