- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారత్‌లో గత 24 గంటల్లో 11,929 కేసులు
by vinod kumar |

X
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమేనా విజృంభిస్తోంది. రోజురోజుకీ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో ఏకంగా 11,929 కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరోజే 12 వేలకు చేరువలో వైరస్ దూసుకెళ్లడం ఆందోళనకరంగా మారింది. అటు కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసేటప్పటికి గడిచిన 24 గంటల్లో 311 మంది మరణించినట్లు ప్రకటించింది. తాజాగా మృతి చెందిన వారితో దేశంలో కరోనా మరణాల సంఖ్య 9195గా ఉంది. ఇప్పటివరకు మొత్తం 3,20,922 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 1,49,348 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు కరోనా వ్యాధి నుంచి కొలుకున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇప్పటి వరకు 1,62,379 మంది ఈ మహమ్మారిని జయించి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్రం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది.
Next Story