- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మగధీర.. నన్ను టెస్ట్ చేసింది : చరణ్
మగధీర.. దర్శక ధీరుడు రాజమౌళి అద్భుత చిత్రం. ఎన్ని జన్మలైనా సరే, ప్రేమ అలాగే నిలిచిపోతుందని.. గత జన్మలో కలిగిన ప్రేమ మరు జన్మలో ఇద్దరినీ కలుపగలదని చూపించిన చిత్రం. ఒక్కొక్కన్ని కాదు షేర్ ఖాన్.. వంద మందిని ఒకేసారి రమ్మను.. అంటూ రెండో చిత్రానికే చరణ్ కత్తి సవారీ, విలు విద్య, గుర్రపు స్వారీ చేసి చూపించి అభిమానుల అంచనాలను అందుకుంటూ దూసుకొచ్చాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ఈ సినిమాతో మెప్పు పొందాడు. ‘చావులోనైనా తోడురా.. భైరవా’ అంటూ అభినయం, అందంతో మురిపించిన రాకుమారి, పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ ఈ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోగా.. ఇండస్ట్రీలో స్టార్ రేంజ్ పొందేందుకు ఈ సినిమానే పునాదిగా ఉపయోగపడింది. కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, సెంథిల్ కెమెరా పనితనం.. ఒక్కటేమిటి 24 క్రాఫ్ట్స్ 100 శాతం ఎఫర్ట్ పెట్టగా.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేసింది. గీతా ఆర్ట్స్ పతాకంపై రూ.32 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా.. జక్కన్న పర్‌ఫెక్ట్ విజన్‌తో సక్సెస్ అయి.. బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల వసూళ్లు సాధించింది.
కాగా ఈ సినిమా రిలీజై జులై 30కి 11 ఏళ్లు కాగా.. కథానాయకుడు చరణ్ థాంక్స్ నోట్ షేర్ చేశాడు. ఈ చిత్రం మరిచిపోలేని అనుభవమని.. తనలో ఉన్న ప్రతీ నైపుణ్యాన్ని పరీక్షించిన చిత్రమిదని అన్నాడు. మగధీర మూవీ యూనిట్, ప్రేక్షకుల ప్రేమకు ఎప్పటికీ దాసోహం అని చెప్పిన చెర్రీ.. తన పరిమితులను పెంచేందుకు ప్రోత్సహించిన రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపాడు. కష్టపడి పనిచేస్తే ఫలితం గొప్పగా ఉంటుందని జక్కన్న చెప్పేవారని గుర్తు చేసుకున్నాడు.
View this post on InstagramA post shared by Ram Charan (@alwaysramcharan) on