ఇరాక్‌లో ఐఎస్ దాడి.. 11 మంది మృతి

by vinod kumar |   ( Updated:2020-11-09 07:57:59.0  )
ఇరాక్‌లో ఐఎస్ దాడి.. 11 మంది మృతి
X

బాగ్దాద్: ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా పశ్చిమ బాగ్దాద్‌లోని ఓ ఆర్మీ పోస్టుపై విచక్షణరహిత కాల్పులు, గ్రెనేడ్లతో దాడికి దిగింది. దీంతో ఐదుగురు జవాన్లు సహా ఆరుగురు పౌరులు మరణించారు. నాలుగు వాహనాల్లో ఉగ్రవాదులు అక్కడికి చేరి ఆటోమెటిక్ గన్‌లతో ప్రభుత్వ సున్నీ మిలీషియాపై కాల్పులు జరిపారు. గ్రెనేడ్లు విసిరారని భద్రతా అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 11 మంది మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడగా, వారిని సెంట్రల్ బాగ్దాద్‌లోని హాస్పిటల్‌కు తరలించినట్టు వైద్యులు తెలిపారు. కాగా, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఐఎస్ ఇంకా ప్రకటన చేయలేదు.

Advertisement

Next Story