- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహా పిరమిడ్ పిలుస్తోంది.. నేటి నుంచి 11 రోజుల పాటు ధ్యాన వేడుకలు
దిశ, ఆమనగల్లు: మహిళా ధ్యాన మహా చక్రాలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే వేడుకల కోసం మహా పిరమిడ్ ను సర్వాంగ సుందరంగా అలంకరించారు.. కడ్తాల్ అన్మాస్ పల్లి గ్రామాల సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మితమైన అద్భుతమైన కట్టడం మహా పిరమిడ్. ధ్యాన జనులకు స్వర్గధామంగా పిలవబడుతున్న మహా పిరమిడ్ ధ్యాన మహాచక్రం-12 లో భాగంగా నిర్వహించే మహిళా ధ్యాన మహాచక్రం-3కు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
11 రోజుల పాటు నిర్వహించే ధ్యాన మహా చక్రాలకు పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక వసతి, వైద్యం, అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రతి రోజు వేల సంఖ్యలో ధ్యానులు పాల్గొంటున్నందున వారికి ఉచిత వసతి తో పాటు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు పత్రీజీ వేణుగాన సంగీతం, అనంతరం సామూహిక ధ్యానం, సందేశం వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనతో పాటు ధ్యాన గురువుల ఆధ్యాత్మిక ధ్యాన సందేశాలు ఉంటాయి. నేడు సాయంత్రం 5 గంటలకు ధ్యాన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ, సతీమణి స్వర్ణమాల పత్రీజీ మహిళా ధ్యాన మహాచక్రం ప్రారంభిస్తారు.
ధ్యానులకు సేవలందించేందుకు 24 గంటల పాటు వాలంటీర్లు ఉంటారు. వైద్య సేవల కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల కోసం బాల కేంద్రంతో పాటు, అఖండ ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11 రోజుల పాటు జరిగే ధ్యాన వేడుకలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ధ్యానులు, సందర్శకులు, కళాకారులు విచ్చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రముఖ కళాకారులచే రాష్ట్ర కార్యక్రమాలు ఉంటాయి.