- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగిల్ క్యారెక్టర్.. సింగిల్ షాట్.. ‘105 మినిట్స్’ మూవీ
దిశ, సినిమా : ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్‌పై అద్భుతం జరగబోతోంది. తొలిసారి సింగిల్ క్యారెక్టర్, సింగిల్ షాట్‌తో సినిమాను తెరకెక్కించబోతున్నారు దర్శకుడు రాజు దుస్సా. హన్సిక మొత్వాని ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రాన్ని రుద్రాన్ష్ సెల్యులాయిడ్ బ్యానర్‌పై బొమ్మక్ శివ నిర్మిస్తుండగా.. ‘105 మినిట్స్’ టైటిల్ ఖరారైంది. రీల్ టైమ్ – రియల్ టైమ్ సినిమాకు హైలెట్ కానుండగా.. ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ, కథనం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందన్నారు.
ఎలాంటి ఎడిటింగ్ లేకుండా తెరకెక్కిస్తున్న ఈ సింగిల్ షాట్ సినిమాలో.. హన్సిక డిఫరెంట్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను అలరించనుందని తెలిపిన డైరెక్టర్.. ఈ మూవీ తన కెరియర్‌లోనే మైల్ స్టోన్‌గా నిలిచిపోతుందన్నారు. ఇక ఈ సినిమా మేకింగ్ సినిమాటోగ్రాఫర్ దుర్గ కిశోర్‌కు ఓ ఛాలెంజ్ అన్న డైరెక్టర్.. అన్ని కమర్షియల్ హంగులు జోడించి సినిమా చేస్తున్నామన్నారు. చిత్ర నిర్మాణ విలువలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్మాత బొమ్మక్ శివ వెల్లడించారు.