నిర్మల్ జిల్లాలో వంద శాతం కర్ఫ్యూ అమలు

by Aamani |
నిర్మల్ జిల్లాలో వంద శాతం కర్ఫ్యూ అమలు
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఏప్రిల్ 30వ తేది వరకు వంద శాతం కర్ఫ్యూ అమలులో ఉంటుందని కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ తెలిపారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్లు, పోలీసు అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముషారఫ్ అలీ మాట్లాడుతూ.. జిల్లాలో 19 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయిందని చెప్పారు. అలాగే 14 కంటైన్‌మెంట్ జోన్‌లుగా గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా జోన్‌‌లల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా.. సోడియం హైపోక్లోరైడ్ చల్లించడంతో పాటు ప్రత్యేక వైద్య బృందంతో స్క్రీనింగ్ కూడా చేస్తున్నట్లు తెలిపారు. నిత్యావసర సరుకులను ప్రజలకు అందించేందుకు ప్రతి వార్డులో దాదాపు 25 ఇండ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి వారికి పాస్ ఇస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ పట్టణంలో ఎనిమిది చోట్ల కూరగాయల మార్కెట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు కూరగాయల అమ్మకాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. అన్ని దుకాణాల వద్ద ప్రభుత్వ నిబంధనల మేరకు సామాజిక దూరం, క్యూ లైన్ పాటించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌, అధికారులకు కలెక్టర్ ముషారప్ అలీ సూచించారు.

tag: collector musharraf ali, meeting, lockdown, curfew, nirmal

Advertisement

Next Story

Most Viewed