- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇకపై ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌లకు పదిశాతం రిజర్వేషన్ ఇస్తూ గతంలోనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోనూ అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్‌ను అమలు చేయనున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఉద్యోగ నియామకాల్లో, విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు పది శాతం వర్తింప జేయాలని వేర్వేరు జీవోల్లో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పరిధిలో లేకుండా రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారిని ఈడబ్ల్యూఎస్ కింద గుర్తిస్తారని, ఎమ్మార్వో కార్యాలయం ఇచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా అన్ని పత్రాలు పరిశీలించి ఎకనామికల్లీ బ్యాక్వార్డ్ క్లాస్‌కి చెందిన వ్యక్తులుగా గుర్తిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ ప్రక్రియలో సంబంధిత ధృవపత్రాలు తప్పని తేలితే చట్టపరమైన చర్యలుంటాయని తెలిపింది. రాష్ట్రంలోని మైనారిటీ కాలేజీల్లో మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఇకనుంచి అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ పదిశాతం రిజర్వేషన్ వర్తించనుంది. ఈడబ్య్లూఎస్ నియామకాల్లోనూ మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్ ఉంటుందని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో వివరించారు. అంతేకాకుండా నియాకాల్లోనూ ఐదేళ్ల వయోపరిమితి ఉంటుందని సూచించారు.