- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పూణెలో 10 రోజుల లాక్‌డౌన్
by Shamantha N |

X
పూణె: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూణె జిల్లా అధికార యంత్రాంగం మళ్లీ లాక్‌డౌన్ విధించే నిర్ణయాన్ని తీసుకుంది. పూణె, పింప్రి-చించ్వాడ్‌లలో ఈ నెల 14 నుంచి 23 వరకు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు పూణె డివిజనల్ కమిషనర్ దీపక్ వెల్లడించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో సమీక్ష జరిపిన తర్వాత ఈ నిర్ణయాన్ని అధికారులు ప్రకటించారు. ప్రజలు నిత్యావసర సరుకులు సమకూర్చుకోవడానికి 14వ తేదీ వరకు అవకాశమిస్తున్నట్టు దీపక్ తెలిపారు. లాక్‌డౌన్ మొదటి ఐదురోజుల్లో లాక్‌డౌన్ కఠినంగా ఉంటుందని, కేవలం పాలు, మందులు, క్లినిక్‌లు, ఆస్పత్రులకు మాత్రమే అనుమతి ఉంటుందని వివరించారు. తర్వాతి ఐదు రోజుల్లో కూరగాయలు, నిత్యావసర సరుకులకు అనుమతి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం పూణెలో సుమారు 35వేల కేసులున్నాయి. కేవలం శుక్రవారం ఒక్కరోజే 1,921 కొత్త కేసులు రిపోర్ట్ అయ్యాయి.
Next Story