కోల్‌కత్తాలో ప్రధాని మోడీ .. 24 గంటల్లో 1మిలియన్ లైక్స్

by Shamantha N |   ( Updated:2021-01-24 01:51:25.0  )
కోల్‌కత్తాలో ప్రధాని మోడీ .. 24 గంటల్లో 1మిలియన్ లైక్స్
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ కోల్‌కత్తా పర్యటనలో భాగంగా నేతాజీ శుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన విషయం తెలిసిందే. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా కోల్‌కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ రావడంతో అక్కడ హీట్ పెరిగింది. సీఎం మమతా బెనర్జీ విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తింది. ఇక మోడీ నేతాజీకి నివాళులర్పించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కేవలం 24గంటల్లో మోడీ నివాళులర్పిస్తున్న ఓ ఫోటోకు కేవలం 24గంటల్లో 1మిలియన్ లైకులు, 14వేల షేర్లు, 47వేల కామెంట్స్ వచ్చాయి.

Advertisement

Next Story