మరో యాప్‌తో సంచలనం సృష్టిస్తోన్న బైట్‌డ్యాన్స్

by Sujitha Rachapalli |
మరో యాప్‌తో సంచలనం సృష్టిస్తోన్న బైట్‌డ్యాన్స్
X

ప్పటికే టిక్‌టాక్ యాప్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టార్టప్‌గా పేరు సంపాదించుకున్న బైట్‌డ్యాన్స్ కంపెనీ ఇప్పుడు సరికొత్త యాప్‌తో సంచలనం సృష్టిస్తోంది. ‘రెస్సో’ పేరుతో గత డిసెంబర్‌లో భారత్, ఇండోనేషియా దేశాల్లో కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చిన యాప్ బాగా ప్రజాదరణ పొందుతోంది.

మ్యూజిక్ స్ట్రీమింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, యూజర జనరేటెడ్ కంటెంట్ ఈ మూడు ఫీచర్లను కలగలిపి రెస్సో యాప్‌ను రూపొందించారు. దీన్ని సింపుల్‌గా చెప్పాలంటే స్పాటిఫై, ఇన్‌స్టాగ్రాం, టిక్‌టాక్‌ల కలయిక అని అనొచ్చు. దీంతో అందుబాటులో ఉన్న మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లలో భిన్నంగా కనిపిస్తోంది.

కేవలం రెండు నెలల్లోనే లక్షకు పైగా ఆండ్రాయిడ్ డౌన్లోడ్‌లు అయ్యి ప్లేస్టోర్‌ ఇండియాలో మ్యూజిక్ అండ్ ఆడియో కేటగిరీలో నెం. 1 గా నిలిచింది. దీనికి 4.5/5 రేటింగ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం యాడ్‌ఫ్రీ వెర్షన్‌తో పాటు రూ. 99ల నెలవారీ ప్రీమియం ప్లాన్ (30 రోజుల ఉచిత ట్రయల్) కూడా అందుబాటులో ఉంది.

ఫీచర్లు ప్రత్యేకం

ప్రస్తుతం ఏడు భాషల్లో పాటలను అందిస్తున్న ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక ముగ్గురు ఇష్టమైన ఆర్టిస్టులను ఎంచుకోవాలి. అంతకంటే ఎక్కువ కూడా ఎంచుకోవచ్చు. మీ ఎంపికకు అనుగుణంగా యాప్ పాటలను క్యూరేట్ చేస్తుంది. అలాగే ప్రతి పాటకు సోషల్ మీడియాలో లాగ లైక్, కామెంట్, షేర్ బటన్లు ఉంటాయి. అలాగే ‘వైబ్స్’ అని పిలిచే సెక్షన్‌లో చిన్న వీడియోలు, జిఫ్‌లు మ్యూజిక్ ట్రాక్‌కి అనుసంధానంగా జతచేసుకోవచ్చు.

అంతేకాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న మ్యూజిక్ యాప్ లాగ కాకుండా రియల్‌టైమ్ లిరిక్స్‌ని రెస్సో అందిస్తోంది. ఒకవేళ లిరిక్స్‌లో ఏదైనా మిస్ అయినట్లు అనిపిస్తే అందులో చేర్చుకునే సదుపాయం కూడా ఉంది. అలాగే సాంగ్ లిరిక్‌లో నచ్చిన భాగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

Advertisement

Next Story

Most Viewed