- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసలు సిసలు దళిత ద్రోహి కాంగ్రెస్సే : పుట్టమధు
దిశ, కాటారం: ఏనాడూ దళితులను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీయే అసలు సిసలు ద్రోహి అని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆరోపించారు. సోమవారం భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, మహదేవపూర్, కాటారం మండలాల్లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ..మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాల గురించి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి తెలుసుకోకపోవడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రోద్భలంతో ఆయన అనుచరుల చేతిలో మరణించిన పుల్యాల సమ్మయ్యను పరామర్శిచేందుకు ఉత్తమ్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
దళితుల శవాలపై రాజకీయం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజమని అన్నారు. మంథని మధూకర్, కవిరాజు, రంగయ్య, ఇటీవల మరణించిన మల్హర్ మండలంలోని మల్లారం గ్రామస్తుడైన రేవెల్లి రాజబాబు, ఎవరు మృతి చెందినా వారి కుటుంబాలను టిఆర్ఎస్ పార్టీ పక్షాన పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని అందించామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం దళితుల మరణాలను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారని పుట్ట మధు ఆరోపించారు. బాధిత కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయని కాంగ్రెస్ ఈరోజు టిఆర్ఎస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటన్నారు.
దీనికి ఉత్తమ్ కుమార్రెడ్డి జవాబివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవలే కాంగ్రెస్ పిలుపునిచ్చిన ”చలో మల్లారం” కార్యక్రమం వాల్ పోస్టర్లలో చేతి గుర్తు ముద్రించారని.. ఇది శవాలను ఓట్ల కోసం వాడుకునే కుటిల నీతి అని పుట్ట మధు మండిపడ్డారు. మంథని మధుకర్ చనిపోయాక 15 రోజుల తర్వాత ఆయన ఫొటోలను మార్ఫింగ్ చేసి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందిందని, మల్లారం గ్రామానికి చెందిన రేవెల్లి రాజాబాబు మృతిని కూడా ఆ పార్టీ రాజకీయంగా వాడుకుంటోందన్నారు. మంథని నియోజకవర్గంలో ప్రజలందరూ కుల, మత, వర్గ వర్ణ బేదాలు లేకుండా ఐకమత్యంగా జీవించడం మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు, కాంగ్రెస్ నాయకులకు రుచించకనే కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కార్యక్రమంలో భూపాలపల్లి జెడ్పీ ఛైర్మన్ జక్కు శ్రీ హర్షిణి కూడా పాల్గొన్నారు.