- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిలిపి చాహల్.. రోహిత్‌ను అమ్మాయిలా మార్చేశాడు
దిశ, స్పోర్ట్స్: టీమ్ఇండియాలో అత్యంత సరదా మనిషని స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌కు పేరు. మ్యాచ్ జరిగే సమయంలోనే తన చిలిపి చేష్టలతో అందరినీ అలరించే చాహల్.. ఇప్పుడు లాక్‌డౌన్ సమయంలో మరింతగా రెచ్చిపోతున్నాడు. టిక్‌టాక్ వీడియోలతో.. లైవ్‌చాట్ మధ్యలో పంచులతో అందరినీ అలరిస్తూనే ట్రోలింగ్‌కి కూడా గురవుతున్నాడు. అయినా సరే చాహల్ తన రూటు మాత్రం మార్చుకోవడం లేదు. ఈసారి రోహిత్ శర్మ టార్గెట్‌గా నవ్వుకునే పని చేశాడు. ఒక మార్ఫింగ్ యాప్ ఉపయోగించి రోహిత్‌ను అమ్మాయిగా మర్చేశాడు. ట్విట్టర్‌లో రోహిత్ శర్మ అసలు ఫొటోతో ఈ అమ్మాయి ఫొటోను జత చేసి.. సో క్యూట్ లుకింగ్ రోహిత్ శర్మ భయ్యా.. అని క్యాప్షన్ యాడ్ చేశాడు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంత మంది చాహల్ ఫొటోను కూడా అమ్మాయిలా మార్చి ‘నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు’ అని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు టీమ్ఇండియా ఆటగాళ్లందరి ఫొటోలను అమ్మాయి ఫొటోలా మార్చి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.