వైసీపీకి ఢిల్లీ కోర్టు నోటీసులు

by srinivas |
వైసీపీకి ఢిల్లీ కోర్టు నోటీసులు
X

దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ పేరు లొల్లి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు చేరింది. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ అనే పేరును ఉపయోగించే హక్కు తమకు మాత్రమే ఉందంటూ ‘అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని వైఎస్సార్సీపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది.

ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ పేరుతో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిందని, తమదే నిజమైన ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ అని మహబూబ్ బాషా కోర్టుకు తెలిపారు. ‘వైఎస్సార్’ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన పార్టీ ‘అన్న వైఎస్సార్ కాంగ్రెస్’ ఒక్కటేనని స్పష్టం చేశారు. తమ పార్టీ పేరును వైఎస్సార్సీపీ అక్రమంగా ఉపయోగిస్తోందని ఈ పిటిషన్ లో ఆరోపించారు.

జగన్ అధ్యక్షుడిగా వున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు సెప్టెంబరు 3 లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని వైఎస్సార్సీపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.

Advertisement

Next Story