- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నితీశ్‌కు జాక్‌పాట్?.. ఆ విధంగా చూస్తే సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కినట్టే

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ టీమిండియా వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ 2025-26ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఎవరికి చోటు దక్కుతుందోనన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. యువ సంచలనం, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి జాక్‌పాట్ కొట్టనున్నట్టు సమాచారం. అతను సెంట్రల్ కాంట్రాక్ట్ రేసులో ఉన్నాడు. గతేడాది నితీశ్ టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఐదు టెస్టులు, నాలుగు టీ20లు ఆడాడు.
బీసీసీఐ స్టాండర్డ్ పాలసీ ప్రకారం.. నిర్దిష్ట వ్యవధిలో మూడు టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడితే నేరుగా ప్రొ రేటా ఆధారంగా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో గ్రేడ్ సిలో చోటు దక్కుతుంది. నితీశ్ అవసరమైన టెస్టులు ఆడటంతో అతన్ని గ్రేడ్ సిలోకి తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ, యువ పేసర్ హర్షిత్ రాణాలు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటు దక్కనున్నట్టు సమాచారం.
అభిషేక్ నిర్దిష్ట వ్యవధిలో 12 టీ20లు ఆడాడు. హర్షిత్ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు ఆడాల్సి మ్యాచ్‌లను ఆడినప్పటికీ అతనికి కాంట్రాక్ట్ ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరు గ్రేడ్ సిలో చేరితో అలవెన్స్‌లతోపాటు వార్షిక వేతనంగా రూ. కోటి పొందుతారు.