- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంకెంతమంది మరణించాలి.. ప్రభుత్వంపై షర్మిల ఫైర్
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ట్విట్టర్‌లో ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఎందరో మరణిస్తున్నారని, అవన్నీ తెలంగాణ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంకెంత మంది కరోనాతో మరణిస్తే కరోనా కంట్రోల్ తప్పిందనుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంతమంది సామాన్యులు అప్పులబారినపడితే పరిస్థితి అదుపుతప్పిందని భావిస్తారని చురకలంటించారు. రాష్ట్రంలో ఒకవైపు ఆక్సిజన్ అందక, బెడ్లు సరిపోక, వ్యాక్సిన్ అందక ఇబ్బందులు పడుతుంటే పరిస్థితులు కంట్రోల్ లో ఉన్నాయని జబ్బలు చర్చుకోవడం మాని, మీ కళ్ళకున్న గులాబీ గంతలు తీసి కరోనా ను కట్టడి చేయండని విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల డిమాండ్ చేశారు.
Next Story